'పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహమే ఏపీఐడీసీ లక్ష్యం'

'పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహమే ఏపీఐడీసీ లక్ష్యం'

GNTR: పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఏపీఐడీసీ ప్రధాన ఉద్దేశమని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ డేగల ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం తాడేపల్లిలోని ఏపీఐడీసీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. కార్పొరేషన్ ప్రస్తుత స్థితిగతులు, భవిష్యత్ కార్యాచరణపై పలు నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకున్నారు.