VIDEO: నల్లబెల్లిలో యూరియా కొరత.. రైతుల ఆందోళన

VIDEO: నల్లబెల్లిలో యూరియా కొరత.. రైతుల ఆందోళన

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలో యాసంగి వరి సాగు జోరుగా సాగుతుండగా యూరియా ఎరువు కొరత తీవ్రమైంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి సొసైటీ గోదాం ముందు రైతులు భారీ క్యూ కట్టి గంటల తరబడి వేచి ఉంటున్నా సరఫరా సరిపోవడం లేదు. అత్యవసర దశలో ఉన్న పంటలకు ఎరువు లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి యూరియా సరఫరా పెంచాలని స్థానిక రైతులు డిమాండ్ చేశారు.