కాళేశ్వరం పనులు వేగవంతం చేయాలి: ఉత్తమ్
TG: కాళేశ్వరం 3 బ్యారేజీల పునరుద్ధరణపై అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం మరమ్మతు పనులు వేగవంతం చేయాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా మరమ్మతు పనులు పూర్తి చేయాలని సూచించారు. AFRY ఇండియా, ఐఐటీ ముంబైకి డిజైన్ల బాధ్యతలు అప్పగించారు. ఆ డిజైన్లను సెంట్రల్ వాటర్ కమిషన్‌కు పంపాలని నిర్ణయించారు. మరమ్మతుల పనుల కోసం స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.