అలర్ట్.. రేపటి నుంచి మరింత పెరగనున్న ఎండలు
HYD: రాష్ట్రంలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బయటకి రావొద్దని సూచించారు. అలాగే, ఎప్పటికప్పుడు వాటర్ తాగుతూ వడదెబ్బ నుంచి రక్షణ పొందాలన్నారు.