DYFI డివిజన్ నూతన కమిటీ ఎన్నిక

KMM: ఖమ్మం డివిజన్ DYFI నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు చింతల రమేష్ తెలిపారు. నూతన డివిజన్ కమిటీ 27 మందితో,12 మంది ఆఫీస్ బేరర్స్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చెప్పారు. డివిజన్ నూతన అధ్యక్షుడిగా నరేష్, కార్యదర్శిగా నాగరాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అన్నారు. నూతన కమిటీ సభ్యులకు జిల్లా అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలిపారు.