శిథిలావస్థకు చేరుకున్న గాంధీ విగ్రహం

RR: ఫరూఖ్ నగర్ మండలం చిలకమర్రి గ్రామంలో గాంధీ విగ్రహం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో గాంధీ విగ్రహం కుడిచేతి పూర్తిగా విరిగిపోయింది. విగ్రహానికి కుడి చేయి విరిగి ఉన్నప్పటికీ దానిని ఎవరు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి అయిన గాంధీ విగ్రహం పరిస్థితి మెరుగుపర్చాలని స్థానికులు కోరుతున్నారు.