'గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం'

'గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం'

కృష్ణా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణాను అడ్డుకుని, విద్యార్థుల్లో గంజాయి వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.