ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన అధికారులు
MNCL: దండేపల్లి మండలంలోని ధర్మారావుపేట గ్రామ ప్రభుత్వ పాఠశాలను సెక్టోరియల్ అధికారులు భరత్, సత్తయ్య పరిశీలించారు. గురువారం వారు పాఠశాలను సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలంటే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని వారు సూచించారు.