'కల్లు గీతకార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం'

కోనసీమ: కల్లు గీతకార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మున్సిపల్ వైస్ ఛైర్మన్ పిల్లి గణేష్ పేర్కొన్నారు. మండపేట శెట్టి బలిజ బీసీ కమ్యూనిటీ హాల్ వద్ద సోమవారం CM చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. మద్యం షాపుల్లో కల్లు గీతకార్మికులకు 10 శాతం కేటాయింపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.