ఆర్ముడ్ రిజర్వ్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం
VSP: విశాఖ ఆర్ముడ్ రిజర్వ్ కార్యాలయం వద్ద భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్ డాక్టర్. శంఖబ్రత భాగ్చి భారత రాజ్యాంగ పీఠికను చదివి వినిపించి, ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ.. దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.