శబరిమల ఘటనపై రాజాసింగ్ ఆగ్రహం

శబరిమల ఘటనపై రాజాసింగ్ ఆగ్రహం

HYD: శబరిమలలో జరిగిన ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ స్వాములతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమలలో తెలుగు వాళ్లకు ఒక కో-ఆర్డినేటర్‌ను నియమించాలని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. స్వాములతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.