బస్సు సౌకర్యం లేక ప్రజల ఆందోళన
TPT: పెళ్లకూరు మండలంలోని రోసనూరు, రాజుపాలెం గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల్లో బస్సు నడుపుతామని ఇచ్చిన హామీ నెల గడిచినా నెరవేరకపోవడంతో గ్రామస్థులు ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌకర్యం లేక విద్యార్థులు, వృద్ధులు, గర్భిణీలు రోజువారీ అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు వాపోయారు.