నేడు ఇస్కాన్ సైబరాబాద్ ఆలయానికి భూమిపూజ

నేడు ఇస్కాన్ సైబరాబాద్ ఆలయానికి భూమిపూజ

HYD: సైబరాబాద్‌లో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి ఇవాళ భూమిపూజ నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు శ్రీరామదాసు తెలిపారు. నల్లగండ్ల-గోపన్ పల్లిలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం పక్కన ఇస్కాన్ ఆలయం నిర్మించనున్నట్లు వెల్లడించారు. భూమిపూజ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యఅతిథులుగా, స్థానిక ప్రజాప్రతినిధులు అతిధులుగా హాజరవుతారన్నారు.