అనకాపల్లిలో పర్యటించిన మాజీ మంత్రి

AKP: కూటమి ఎమ్మెల్యేలు కొబ్బరికాయ కొట్టడమే కనిపిస్తుంది కానీ అభివృద్ధి మాత్రం కనిపించడం లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శుక్రవారం చోడవరం నియోజకవర్గం, అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. చోడవరంలో బ్రిడ్జి కూలిపోయి నెల రోజులు అయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పాడుతున్నారని తెలిపారు. ఆయనతో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు.