అక్రమంగా నిల్వ చేసిన 23 గ్యాస్ సిలిండర్లు సీజ్
JN: దేవరుప్పుల మండలంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు నిల్వ చేసి రీఫిల్లింగ్ చేస్తున్నారనే సమాచారం మేరకు నిన్న అధికారులు తనిఖీలు నిర్వహించారు. కోలుకొండ, సింగరాజుపల్లి గ్రామాల్లో నిల్వ చేసిన 23 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు డీటీసీఎస్ లచ్చు నాయక్ తెలిపారు. తనిఖీల్లో ARI అశోక్, దేవరుప్పుల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.