నారనాగేపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం

SS: మంత్రి సవిత చొరవతో 10 రోజుల్లోనే నారనాగేపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలిగింది. రొద్దం మండలం నారనాగేపల్లి గ్రామ ప్రజలు, విద్యార్థులు తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రిని కోరారు. స్పందించిన ఆమె అధికారులతో మాట్లాడి గ్రామానికి బస్సును ఏర్పాటు చేయించారు. దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి సవితకు ధన్యవాదాలు తెలిపారు.