VIDEO: ఈ నెల 30 వరకు విశాఖ బీచ్ మూసివేత
VSP: మోంథా తుపాను ప్రభావంతో విశాఖపట్నం తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తుపాను తీవ్రత, అలల ఉద్ధృతి దృష్ట్యా, అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. సురక్షిత కారణాల రీత్యా, పర్యాటకులు అక్టోబర్ 30 వరకు బీచ్ వైపు ఎవరూ వెళ్లవద్దని, బీచ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని మంగళవారం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.