VIDEO: పెద్దారెడ్డి వస్తే మళ్లీ ఫ్యాక్షన్ గొడవలు: ఎమ్మెల్యే

ATP: మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెడితే మళ్లీ ఫ్యాక్షన్ గొడవలు చెలరేగుతాయని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై ఒక్క అక్రమ కేసు కూడా పెట్టలేదని స్పష్టం చేశారు. పెద్దారెడ్డి రాకతో ప్రశాంతత భంగం కలుగుతుందని ప్రజలే అడ్డుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.