భక్తిశ్రద్ధలతో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట
ATP: గుంతకల్లు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట పూజ భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి గుంతకల్లు మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.