కామరాజుపేటలో ఇంటింటికీ 'రైతన్న మీకోసం' కార్యక్రమం
E.G: గోకవరం మండలంలోని 14 పంచాయతీల పరిధిలో 'రైతన్న మీకోసం' ప్రచార కార్యక్రమాన్ని సోమవారం కామరాజుపేటలో ప్రారంభించారు. ఈ నెల 24 నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఏవో రాజేశ్వరి తెలిపారు. సచివాలయాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, వీరు ప్రతి రైతు ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారన్నారు.