'బహిరంగ సభను జయప్రదం చేయండి'

'బహిరంగ సభను జయప్రదం చేయండి'

SRPT: జనవరి 18న ఖమ్మంలో జరిగే సీపీఐ శతజయంతి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేటలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని, ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని విమర్శించారు.