PACS అధ్యక్షులు, సభ్యులు నియామకాలు పూర్తి

కృష్ణా: తోట్లవల్లూరు మండలం PACS అధ్యక్షులు, సభ్యులు నియామకాలు పూర్తి అయ్యాయి. 2026 జనవరి 30 వరకు పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చాగంటిపాడు PACS అధ్యక్షుడిగా కళ్ళం వంశీ , పెనమకూరు PACS అధ్యక్షుడిగా మరీదు ధర్మా రావు, గరికపర్రు PACS అధ్యక్షుడిగా గూడపాటి గిరి బాబుని నియమించారు.