'ఆర్గానిక్ సంత విజయవంతం'
VSP: విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలోని హబ్‌లో ఆదివారం నిర్వహించిన భారత్ కిసాన్ సంఘ్ ప్రకృతి పంటల, ఉత్పత్తుల సంత విజయవంతమైందని కేంద్ర కమిటీ సభ్యులు జలగం కుమారస్వామి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రసాయనాలు లేని ప్రకృతి ఆధారిత ఉత్పత్తులనే ఆరగించాలని ఆయన కోరారు. ఈ సంత ప్రతి ఆదివారం ఇక్కడే జరుగుతుందన్నారు.