గాయంపై శ్రద్ధాకపూర్ అప్‌డేట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ప్రస్తుతం 'ఈఠా'లో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో ఆమె కాలుకు గాయమైన విషయం తెలిసిందే. తాజాగా తన హెల్త్ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకుంది. 'పెద్ద దెబ్బ ఏం కాదు.. కాలి కండరానికి గాయమైంది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమన్నారు. నేను క్షేమంగానే ఉన్నా.. త్వరలోనే మీ ముందుకు వస్తాను' అని పేర్కొంది.