సీఎం రేవంత్,రవీందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం
NZB: వర్షాకాలం పంటకు మద్దతు ధరతో పాటు ప్రభుత్వం బోనస్ కూడా వేస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తూ మోస్రా మండలం గోవూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ బాన్సువాడ ఇన్‌ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ సుందర్ గౌడ్, పొట్టేంగారి శ్రీధర్ రెడ్డి, రాంరెడ్డి, గంగాప్రసాద్, అబ్బయ్య, సాయిలు పాల్గొన్నారు.