సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు: కలెక్టర్
RR: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దుచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజావాణి కొనసాగుతుందన్నారు. ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.