దళితుల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి

దళితుల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి

NZB: ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాదిగ సంఘాల ఆధ్వర్యంలో నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కెర భూమన్న మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల సభ్యులు పాల్గొన్నారు.