VIDEO: పొదలకూరులో మద్యం దుకాణంలో చోరీ
నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు షాపు వెనుక వైపు ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి లోపలికి చొరబడి, కౌంటర్లో ఉన్న సుమారు రూ. 30 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. దొంగల ఆచూకీ కోసం క్లూస్ టీం సాయంతో వేలిముద్రలు సేకరిస్తున్నారు.