VIDEO: మహదేవపూర్‌లో భారీ వర్షాలు.. నీట మునిగిన పంటలు

BHPL: జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మహదేవపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పంట చేన్లు బుధవారం వరద నీటిలో మునిగాయి. రాత్రికి రాత్రి వచ్చిన వరదతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అధికారులు వెంటనే పంట నష్టాన్ని పరిశీలించి, రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.