T20 WC FINAL: అంతర్జాతీయ, దేశీ స్టార్ల సందడి

T20 WC FINAL: అంతర్జాతీయ, దేశీ స్టార్ల సందడి

T20 WC 2026 తుది దశకు చేరుకుంది. ఇవాళ అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఈ మ్యాచ్‌కు ముందు అట్టహాసంగా ముగింపు వేడుకలను నిర్వహించనున్నారు. వేడుకల్లో గ్లోబల్ పాప్ సూపర్ స్టార్ రికీ మార్టిన్‌తో పాటు భారతీయ ప్రముఖ గాయకులు ఫాల్గుణి పాఠక్, సుఖ్ బీర్ సింగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.