మాకు అధికారం ఉంటే అతన్ని సస్పెండ్ చేస్తాం: హైకోర్టు

మాకు అధికారం ఉంటే అతన్ని సస్పెండ్ చేస్తాం:  హైకోర్టు

AP: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో పదోన్నతులు ఇవ్వకుండా వేధిస్తున్నారని పేర్కొంది. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ అహ్మద్‌బాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకే అధికారం ఉంటే అతన్ని సస్పెండ్ చేసే వాళ్లమని పేర్కొంది. కేసు విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.