BJP కార్పోరేటర్‌పై FIR నమోదు

BJP కార్పోరేటర్‌పై FIR నమోదు

నిజామాబాద్ బీజేపీ కార్పొరేటర్ మఠం పవన్‌పై 5వ టౌన్ పోలీసులు FIR నమోదు చేశారు. నగరంలోని లలితానగర్‌కు చెందిన గడ్డం ప్రసాద్ అనే వ్యక్తి కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ FIR నమోదైంది. అన్ని అనుమతులు తీసుకుని ఇల్లు నిర్మిస్తుంటే కార్పొరేటర్ మఠం పవన్, అతని అనుచరుడు వినోద్ 15 రోజుల క్రితం తనను డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేయగా FIR నమోదైంది.