'మత విద్వేషాలను రెచ్చగొట్టాలనేదే భూమన ప్రయత్నం'

BPT: మత విద్వేషాలను రెచ్చగొట్టాలని భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. ఆదివారం బాపట్లలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. టీటీడీపై భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోమాతలపై అసత్య ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని పేర్కొన్నారు.