కేడీసీసీ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి

ELR: చాట్రాయి మండల కేంద్రంలో రూ.97 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన కేడీసీసీ బ్యాంకు నూతన భవనాన్ని శుక్రవారం మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం సాధించిన విజయాల గురించి వివరించారు.