నెతన్యాహు బతికే ఉన్నారా? నెటిజన్ల డౌట్లు!
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరణించారంటూ SMలో చర్చ జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఓ వీడియోలో ఆయన చేతికి 'ఆరు వేళ్లు' కనిపించడంతో అది AI సృష్టించిన ఫేక్ వీడియో అని నెటిజన్లు అనుమానిస్తున్నారు. అయితే, ఇది కేవలం కెమెరా యాంగిల్ వల్ల ఏర్పడిన భ్రమ అని, ఆయన క్షేమంగానే ఉన్నారని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు తేల్చాయి. నెతన్యాహు గురువారమే మీడియా సమావేశంలో పాల్గొని యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.