వరకట్న మరణాలపై సుప్రీంకోర్టు విచారం
వరకట్న మరణాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వరకట్నం చట్టరీత్యా నేరమైనా ఇంకా చాలా ప్రాంతాల్లో ఈ విధానం కొనసాగుతోందని తెలిపింది. దీనివల్ల వేలాది మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ అత్యున్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. ఇలాంటి మరణాలు సమాజానికి మాయని మచ్చ అని పేర్కొంది.