రక్తదానం చేసిన నర్సాపూర్ (జి) గ్రామ యువకుడు

NRML: నర్సాపూర్ (జి) మండల కేంద్రానికి చెందిన అంగరి శ్రీనివాస్ స్నేహితులు వాట్సాప్ గ్రూపులో ఏబీ పాజిటివ్ ప్లేట్లెట్స్ అవసరమని పోస్ట్ చేశారు. స్పందించిన శ్రీనివాస్ నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమ్య అనే మహిళకు ఏబీ పాజిటివ్ ప్లేట్లెట్స్ ఇచ్చి మానవత్వం చాటాడు. రక్తదాతకు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.