టంగుటూరులో CMRF చెక్కుల పంపిణీ

టంగుటూరులో CMRF చెక్కుల పంపిణీ

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి క్యాంపు కార్యాలయంలో ఆదివారం మర్రిపూడి మండలం పలువురికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యం పట్ల సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం నియోజకవర్గంలో వెయ్యి మందికి రూ.9కోట్ల వరకు సాయం చేశామని చెప్పారు.