కోటేకల్ ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ దిగ్భ్రాంతి

కోటేకల్ ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ దిగ్భ్రాంతి

KRNL: ఎమ్మిగనూరు మండలం కోటేకల్ వద్ద రెండు కార్లు ఢీకొని ఐదుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం బాధాకరమన్న మంత్రి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.