ముదిరాజ్ నాయకుల ముందస్తు అరెస్టు
SRPT: అనంతగిరి మండలం ఖానాపురంలో ముదిరాజ్ సంఘం నాయకులను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ముందస్తుగా అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్తుండగా వారిని అడ్డుకున్నారు. తమ కులానికి కేటాయించిన భవన స్థలం విషయంలో జరుగుతున్న పరిణామాలను నిరసిస్తున్న నాయకులు ఈ అరెస్టులను అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు.