వేసవిలో మామిడి సంరక్షణపై అవగాహన
CTR: వేసవిలో మామిడి పూత, పిందె సస్య రక్షణపై ఉద్యానవన శాఖ అధికారులు సదుంలోని ఎర్రాతివారిపల్లెలో బుధవారం అవగాహన కల్పించారు. వేడిని తట్టుకోవడానికి విరివిగా తోటలకు తడులు ఇస్తుండాలని జిల్లా హార్టీకల్చర్ ఆఫీసర్ రామాంజనేయులు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త పీర్ సాహెబ్ సూచించారు. వేడికి మామిడి పిందెలు రాలిపోకుండా సున్నపు నీటిని పిచికారీ చేయాలన్నారు.