'చిన్నారుల ఆరోగ్యం నిరంతరం పరిశీలించాలి'

'చిన్నారుల ఆరోగ్యం నిరంతరం పరిశీలించాలి'

AKP: చిన్నారులలో ఎనీమియా రాకుండా పౌష్టికాహారం సక్రమంగా అందించాలని, వారి ఆరోగ్యం నిరంతరం పరిశీలించాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. శనివారం అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో ఐ.సీ.డీ.ఎస్. అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటిస్తూ వారి పఠనాశక్తిని పరిశీలించారు.