'ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు పూర్తి చేయాలి'

'ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు పూర్తి చేయాలి'

BDK: ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఇల్లందు పట్టణంలోని 3వ వార్డులో జరుగుతున్న రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆదివారం పర్యవేక్షించారు. పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా చూడాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వంశీ, కాంట్రాక్టర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.