'ఆ ఉత్పత్తులపై అధిక పన్నులు వేయండి'

'ఆ ఉత్పత్తులపై అధిక పన్నులు వేయండి'

పొగాకు  ఉత్పత్తుల వల్ల ప్రజలకు తీవ్ర ముప్పు ఉన్నందున వాటి  ఉత్పత్తులపై భారీగా పన్నులు వేయాలని కేంద్రానికి పార్లమెంటరీ స్థాయి సంఘం సూచించింది. తద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాన్సర్ పరిశోధనకు, చికిత్సకు ఉపయోగించాలని తెలిపింది. క్యాన్సర్ వ్యాధిపై అన్ని ప్రభుత్వాలు అవగాహన కల్పించాలని చెప్పింది. అలాగే భారతీయ సంప్రదాయ వైద్య విధానమైన ఆయుష్ వైద్య వ్యవస్థను మరింత విస్తృతం చేయాలని పేర్కొంది.