పోలీసులకు చిక్కన గంజాయి బ్యాచ్

పోలీసులకు చిక్కన గంజాయి బ్యాచ్

E.G: జిల్లాలోని కోటనందూరులో గంజాయి వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తుని- నర్సీపట్నం రహదారి సమీపంలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 240 గ్రాముల గంజాయి, రెండు మొబైల్స్, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. యువకులు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.