గుండెపోటుతో రైతు మృతి

KDP: కమలాపురం మండల పరిధిలోని అప్పారావు పల్లెలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు అప్పల రెడ్డి వెంకటరమణారెడ్డి(58) గురువారం పొలంలో పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆరోగ్యంగా ఉండే వెంకటరమణారెడ్డి మృతి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.