గుడుంబా స్థావరాల పై పోలీసులు మెరుపు దాడులు..

గుడుంబా స్థావరాల పై పోలీసులు మెరుపు దాడులు..

BHPL: మల్హర్ మండలం వల్లెంకుంటలో గుడుంబా స్థావరాలపై ఎస్సై వడ్లకొండ నరేష్ ఆధ్వర్యంలో ఇవాళ పోలీసులు ముమ్మర దాడులు చేశారు. గ్రామానికి చెందిన రఘు ఇంట్లో 20 లీటర్లు, లక్ష్మీకోయ్ ఇంట్లో 14 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకొని, ఇరువురిపై కేసులు నమోదు చేశారు. గుడుంబా తయారీ సామాగ్రిని ధ్వంసం చేసిన పోలీసులు, విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.