జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులుగా రాజేటి శ్రీనివాసరావు
VZM: వైసీపీ జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులుగా రాజేటి శ్రీనివాసరావును, దత్తిరాజేరు మండల బూత్ కమిటీ అధ్యక్షులుగా సామిరెడ్డి లక్ష్మణరావును నియమించారు. ఈమేరకు వారు శుక్రవారం విజయనగరంలోని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ మహాదేవ్ ఫణీంద్ర పాల్గొన్నారు.