హైదరాబాద్ నుంచి వచ్చే వారికి రూట్ ఇదే.?

హైదరాబాద్ నుంచి వచ్చే వారికి రూట్ ఇదే.?

NTR: అమరావతి పునఃప్రారంభ సభ నేపథ్యంలో మే 2న NH-65పై ట్రాఫిక్ మళ్లింపులు జరగనున్నాయి. హైదరాబాద్ నుంచి ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లే వాహనాలను విజయవాడ నగర శివారులో ఉన్న గొల్లపూడి నుంచి పశ్చిమ బైపాస్ మార్గంగా గన్నవరం మండలంలోని చిన్న అవుటుపల్లి వరకు మళ్లించనున్నారు. దీంతో వాహన దారులకు దిశానిర్దేశక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.