పత్రాలు లేని 48 మోటార్ సైకిళ్లు సీజ్

KKD: జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు గొల్లప్రోలు మండలం చెందుర్తిలో సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాల సాయంతో చేపట్టిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 48 మోటార్ సైకిళ్లు, రెండు కార్లు, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు. ఈ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.